VSP: అనకాపల్లి జిల్లా ఇంచార్జ్ మంత్రి కొల్లు రవీంద్రతో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోమవారం విశాఖలో భేటీ అయ్యారు. ఎలమంచిలి నియోజకవర్గంలో సమస్యలను మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వెనకబడిన ఎలమంచిలి నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.