AP: కాకినాడ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు సస్పెన్షన్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. అతన్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ‘X’ వేదికగా పోస్టు పెట్టారు. తుని డిపోలో పని చేస్తున్న లోవరాజు ఇటీవల బస్సు రిపేర్ రావడంతో ‘దేవర’ సాంగ్‌కి స్టెప్పులేసి సస్పెండైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని నెటిజన్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. ‘లోవరాజు తన ఉద్యోగం చేసుకోవచ్చు. త్వరలోనే అతడిని కలుస్తాను’ అని ట్వీట్ చేశారు.