ప్రకాశం: మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులకు, ముంపు గ్రామాల బాధితులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాథ్కి వినతిపత్రం అందజేశారు.