SRPT: రాష్ట్రంలో అర్హులైన వికలాంగులు అందరికీ ఎలాంటి షరతులు లేకుండా వారికి అవసరమైన పరికరాలను అందించేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో మాట్లాడుతూ.. వికలాంగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని అన్నారు. వికలాంగులకు పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు.