TG: మాజీమంత్రి కేటీఆర్ హైడ్రా బాధితులను పరామర్శించారు. అందులో భాగంగా హైడ్రా అధికారులు తన ఇంటిని కూల్చివేస్తారనే భయంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ కుటుంబసభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. అనంతరం మాట్లాడుతూ.. బుచ్చమ్మది ఆత్మహత్య కాదని, రేవంత్ చేసిన హత్యనే అంటూ విమర్శించారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదని నగర ప్రజలపై పగపట్టాడని చెప్పుకొచ్చారు. హైడ్రాపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.