ప్రకాశం: అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు మంచికి చెందిన నాగేశ్వరరావు మద్యం మత్తులో ద్విచక్ర వాహనంపై వస్తు కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో అతను అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అతని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.