NDL: విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా చదువును కొనసాగించాలని ప్రొఫెసర్ డాక్టర్ కిషోర్ కుమార్, వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. మహానంది వ్యవసాయ కళాశాల నూతన విద్యార్థులకు సోమవారం ఒత్తిడిని జయించేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ కౌన్సెలింగ్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టంగా చదివితే ఏదీ కష్టం కాదని అన్నారు.