ఇటీవల విమానాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. అధికారులు చర్యలు తీసుకున్నా బెదిరింపులు మాత్రం ఆగడం లేదు. తాజాగా భారత విమానయాన సంస్థకు చెందిన 60కిపైగా విమానాలకు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. గత 15 రోజుల్లో దాదాపు 410కి పైగా విమానాలకు ఈ తరహా బెదిరింపులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.