W.G: నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో రీసర్వే చేసి హిందూ శ్మశాన వాటికకు భూమి అప్పగించాలని కోరుతూ ఆ గ్రామానికి చెందిన సత్యనారాయణ సోమవారం జిల్లా రెవెన్యూ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. తన అర్జీ పరిశీలించిన అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు.