ప్రకాశం: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జరుగుతున్న రక్తదాన శిబిరంలో మేదరమెట్ల SI మహమ్మద్.రఫీ రక్తదానం చేశారు. ఆయన మాట్లాడుతూ.. సరైన సమయంలో రక్తం అందుబాటులో లేక ఎంతోమంది మరణిస్తున్నారని రక్తదానంతో మరొక నిండు ప్రాణాన్ని బ్రతికించవచ్చునని అన్నారు. బాపట్ల జిల్లా SP ఆదేశాల మేరకు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.