ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.3593 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1341 కోట్ల నికర లాభంతో పోలిస్తే దాదాపు 168 శాతం పెరగడం గమనార్హం. జులైలో చేపట్టిన టెలికాం టారిఫ్‌ల సవరణ ఎయిర్‌టెల్‌కు బాగా కలిసొచ్చింది. గత త్రైమాసికంతో (రూ.4159 కోట్లు) పోలిస్తే లాభం 13.6 శాతం తగ్గడం గమనార్హం.