అక్కినేని జాతీయ అవార్డు ప్రదానంలో మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెబుతారు. నా సినీ ప్రస్థానంలో రచ్చ గెలిచాను. ఇంట గెలిచే అవకాశం సినీ వజ్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు ప్రదానంతో ధన్యుడిగా భావించా. ఆ అవార్డు ఇవ్వడాన్ని కొందరు హర్షించలేదు. అలాంటప్పుడు అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. ఆ రోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశాను’ అని చిరంజీవి అన్నారు.