VZM: గంట్యాడ మండలం కోటారుబిల్లి జంక్షన్ వద్ద అక్టోబరు 27న మూడున్నర సంవత్సరాల మైనరు బాలికపై జరిగిన లైంగిక దాడిలో నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలిస్తున్నామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.మైనరు బాలికపై లైంగిక దాడి జరిగినట్లుగా సమాచారం అందిన వెంటనే విజయనగరం మహిళా పీఎస్లో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామన్నారు.