AP: TTD అధికారులపై శ్రీనివాసానంద సరస్వతి స్వామిజీ చేసిన ఆరోపణలు సరికాదని టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వాస్తవంగా స్వామీజీ 50 మందికి బ్రేక్ దర్శనం, 550 మందికి ప్రత్యేక ప్రవేశ దర్శనంతోపాటు తిరుమలలో వసతి కల్పించాలని కోరారు. తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కారణంగా సాధ్యం కాదని ఆ సంఖ్యను తగ్గించాలని అధికారులు కోరారు. దీంతో స్వామిజీ కోపంతో ఆరోపణలు చేశారు’ అని తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది.