భారత పర్యాటకులను ఆకర్షించేందుకు రష్యా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి టూరిజం శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. వీసా రహిత పర్యటనపై భారత్తో రష్యా సంప్రదింపులు జరుపుతోంది. దీంతో 2025 స్ప్రింగ్ సీజన్ ప్రారంభం నుంచి వీసా లేకుండానే రష్యాలో పర్యటించే సదుపాయం అమల్లోకి రానుంది. కాగా మాస్కో సిటీ టూరిజం కమిటీ ఛైర్మన్ ఎవ్జెనీ కోజ్లోవ్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.