ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ IPOకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ధరలను రూ.371-390గా నిర్ణయించింది. మొత్తం రూ.11,300 కోట్ల సమీకరణకు వస్తున్న స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ సబ్స్క్రిప్షన్ నవంబర్ 6 నుంచి 8 వరకు కొనసాగనుంది. IPOలో భాగంగా రూ.6,800 కోట్లు ప్రస్తుత వాటాదారులు తమ షేర్లు విక్రయించడం ద్వారా.. మరో రూ.4500 కోట్లను తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించనున్నారు.