AP: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ నెల 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కానుంది. రూ.895 కోట్ల నిధుల విడుదలకు అనుమతులు రావడంతో.. గ్యాస్ కంపెనీలు, పౌరసరఫరాల జాయింట్కు నిధులు మంజూరు చేశారు. పట్టణ ప్రాంత ప్రజలకు పేమెంట్ చెల్లించిన తర్వాత.. 24 గంటల్లో, గ్రామాల్లో ఉన్నవారికి 48 గంటల్లో DBT ద్వారా డబ్బు జమచేయనున్నారు.