ELR: వన సంరక్షణ సమితి సభ్యులకు వ్యక్తిగతంగా చెట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ జిల్లా కార్యదర్శి కుంచే వసంతరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షుడు ముల్లగిరి లాజరు అధ్యక్షతన నిర్వహించారు.