VZM: గంట్యాడ పోలీసు స్టేషన్ పరిధిలో చిన్నారిపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అమరావతి పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి సంఘటన వివరాలు తెలుసుకుని సభ్య సమాజం తలదించుకునే ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. ఈ విషయంపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌తో మాట్లాడిన మంత్రి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.