2006లో UKకు చెందిన శివన్, ఆడమ్ రాఫ్ అనే దంపతులు ప్రైస్ కంపారిజన్ వెబ్సైట్ ‘ఫౌండమ్’ ప్రారంభించారు. దీనిని వినియోగంలోకి తీసుకువచ్చిన తర్వాత గూగుల్‌లో విజిబిలిటీ తగ్గింది. ప్రజలు కీ వర్డ్ ఉపయోగించి సెర్చ్ చేసినప్పటికీ వెబ్సైట్ కనిపించలేదు. దీంతో ఆ దంపతులు 2010 యూరోపియన్ కమిషన్‌ను సంప్రదించారు. గూగుల్‌కు రూ. 26వేల కోట్ల జరిమానా విధిస్తూ కమిషన్ తీర్పునివ్వగా.. యురోపియన్ కోర్టు సమర్థించింది.