NLR: మహిళా సాధికారతే లక్ష్యంగా మెప్మా ఆధ్వర్యంలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించే స్టాళ్లను ప్రజలంతా సందర్శించి, వారిని ప్రోత్సహించాలని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ నందన్ ఆకాంక్షించారు. స్థానిక బారా షాహిద్ దర్గా రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన విక్రయ స్టాళ్లను అదనపు కమిషనర్ సోమవారం సందర్శించారు.