AP: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా మూవీ ప్రమోషన్లో భాగంగా నిన్న చిత్రయూనిట్ వైజాగ్‌లో ఈవెంట్ నిర్వహించింది. దీనికి MLA గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ‘హీరో సూర్య విలక్షణ నటుడు.. గొప్ప మానవతావాది. చాలా మంది పిల్లలను చదివించడంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు. ఈ చిత్రం సూపర్‌హిట్ కావాలని కోరుకుంటన్నా’అని MLA గంటా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.