ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రూ.168లక్షల కోట్లు ఆదా చేయొచ్చని ఎలాన్ మస్క్ అన్నారు. బైడెన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్లో అనవసర ఖర్చులు ఉన్నాయన్నారు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ మద్దతివ్వడమే కాకుండా పెద్దమొత్తంలో విరాళాలు అందజేస్తున్నారు. అయితే తాను అధ్యక్షుడైతే మస్క్‌కు కేబినెట్లో చోటిస్తానని ట్రంప్ ప్రకటించారు.