ఇటీవల టెస్ట్ క్రికెట్లో ప్రతి మ్యాచ్లో ఫలితం వస్తోంది. 10 శాతం మ్యాచ్లు మాత్రమే డ్రాగా ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్లో ప్రతి మ్యాచ్లో ఫలితం వస్తుండటంపై టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇదే బ్యూటీ ఆఫ్ టెస్ట్ క్రికెట్ అని అభివర్ణించాడు. సానుకూల ఫలితాలు రావడం టెస్ట్ క్రికెట్ అభివృద్ధికి దోహదం చేస్తుందని ధోనీ అభిప్రాయపడ్డాడు.