AP: ప్రజల ఆస్తులను అమ్మడంలో చంద్రబాబు దిట్ట అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ‘సంపద సృష్టించడం దేవుడెరుగు.. ఈ ఆర్థిక సంవత్సరంలో 45వేల కోట్లు అప్పులు తెచ్చారు. తమ వారికి సంపదనంతా దోచిపేట్టే కార్యక్రమం చేస్తున్నారు. రాష్ట్రంలో మూడు పోర్టుల నిర్మాణానికి వైసీపీ హయాంలో వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. నిర్మాణాలు పూర్తి అయినప్పటికీ ఈ రోజుకు కూడా పోర్టులో కార్యకలాపాలు ప్రారంభించలేదు’ అని ధ్వజమెత్తారు.