దాహంగా అనిపించగానే సందర్భాన్ని బట్టి కూర్చుని, నిలుచుని నీళ్లు తాగుతుంటాం. అయితే నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ, ఒక్కొసారి బాగా దాహంగా ఉన్నప్పుడు, లేదా కంగారులో ఉన్నప్పుడు గబగబా నీళ్లు తాగేస్తూ ఉంటాం. ఇలా చేయడం ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిలబడి తాగడం వల్ల పోషకాలు సరిగా అందక మూత్రపిండాలపై ప్రభావం పడే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. కూర్చుని నీరు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.