కృష్ణా: తోట్లవల్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని, ఆ సమస్యలను అధికారులను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.