SRD: జిల్లాలో ఏర్పాటు చేసే టపాకాయల దుకాణాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పి రూపేష్ ఓ ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక దుకాణాలకు డివిజన్ పోలీసు అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ జనావాసాలకు దూరంగా టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేయాలని సూచించారు.