JN: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులను సకాలంలో పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.