NLR: జలదంకి అగ్రికల్చర్ ఆఫీసర్ బి.శైలజ మండలంలోని చామదల గ్రామంలో సమావేశం నిమిత్తం వెళ్తుండగా జలదంకి సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. శైలజ తలకు బలమైన గాయమైంది. అటుగా వెళ్తున్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బావమరిది రావిపాటి సాంబయ్య సేవా దృక్పథంతో తన కారులో ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మంచి మనసును చాటుకున్నారు.