బీహార్ స్వతంత్ర ఎంపీ పప్పూ యాదవ్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చెందిన వ్యవహారాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. లేకపోతే చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. దీనిపై యాదవ్ పోలీసుల్ని ఆశ్రయించారు. తనకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. కాగా.. అప్పట్లో బిష్ణోయ్ గ్యాంగ్‌ను నామారూపాలు లేకుండా చేస్తానని సవాల్ విసిరారు.