దీపావళి రోజున ఇంట్లో కనీసం 5 దీపాలను వెలిగించాలని పండితులు చెబుతున్నారు. పూజ గదిలో, తులసి చెట్టు దగ్గర, డబ్బులు దాచుకునే ప్రదేశంలో, ఇంటి ప్రధాన ద్వారం వద్ద, తాగునీరు ఉండే ప్రదేశంలో లేదా వంటగదిలో పెట్టాలి. కిచెన్లో దీపం పెట్టటం వలన అన్నపూర్ణా దేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. అంతేకాక ఆరుబయట లేదా బాల్కనీలో దీపాలను వెలిగించడం వలన ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తులు ప్రవేశించవని నమ్మకం.