AP: అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ పెరోట్ గ్రూప్ అండ్ హిల్‌వుడ్ డెవలప్మెంట్ ఛైర్మన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏవియేషన్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. అలయెన్స్ టెక్సాస్ తరహా ప్రాజెక్టులకు ఏపీ తీరప్రాంతం అనుకూలమని వెల్లడించినట్లు పేర్కొన్నాయి. దీంతో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి.