పాకిస్థాన్ జట్టుకు ఊహించని షాక్ తగలనుంది. ఆ జట్టు కోచ్ పదవి నుంచి గ్యారీ కిర్‌స్టన్ వైదొలగనున్నట్లు సమాచారం. బోర్డుతో అభిప్రాయ బేధాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో జాసన్ గిలెస్సీ లేదా ఆకిబ్ జావేద్‌ను భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ కారణంగానే పరిమిత ఓవర్ల టీమ్‌తో ఆసీస్ పర్యటనకు ఆయన వెళ్లడం లేదనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.