AP: తల్లి, చెల్లిపై కేసు వేయడంతో జగన్ పాతాళానికి కూరుకుపోయారని TDP సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ‘జగన్ చేయి పట్టుకున్నోళ్లంతా పాతాళానికే వెళ్తారు. ఆస్తుల వివాదం కాదు.. ఇది రాజకీయ ఆత్మహత్య. షర్మిలకు ఇచ్చిన రూ.200 కోట్లు జగన్కు ఎక్కడివి? దీనిపై IT, ED స్పందించట్లేదు. ఒక ఆర్థిక నేరస్తుడు 11ఏళ్లుగా బెయిల్పై ఉండటమేంటి? త్వరలో జగన్ జైలుకెళ్లడం ఖాయం. పాత కేసులకు తోడు కొత్తవి కూడా ఉన్నాయి’ అని అన్నారు.