కోనసీమ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులను కొనియాడారు.