AP: జగన్-షర్మిల మధ్య ఆస్తుల వివాదంపై జనసేన నేత బాలినేని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తల్లి, చెల్లిపై జగన్ కోర్టుకు వెళ్లటం బాధగా ఉంది. ఆడపడుచు కన్నీళ్లు ఆ ఇంటికే అరిష్టమని జగన్ గుర్తించాలి. వైవీ సుబ్బారెడ్డి, నేను విజయమ్మ వల్ల బాగుపడిన వాళ్లమే. షేర్ల బదిలీపై ఇంత రాద్దాంతం ఎందుకు. ఈ విషయంలో విజయమ్మ తప్ప ఎవరూ జోక్యం చేసుకోవద్దని భావిస్తున్నా. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పటికైనా విజయమ్మ ముందుకు రావాలి’ అని అన్నారు.