ASR: 3 నెలలు జీతాలు బకాయిలు, ఇంక్రిమెంట్లు చెల్లించాలంటూ రంపచోడవరంలో 104 సిబ్బంది సభ్యులు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్ నగదును ప్రభుత్వం చెల్లించాలని, పప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 104 వాహనాలను అటాచ్ చేయాలని కోరారు. తక్షణమే సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. లేకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.