శ్రీరాముడు వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు.. నరకాసురుడిని సత్యభామ చంపింది ఒకే రోజు. ఆ రోజునే దీపావళిగా జరుపుకుంటారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ప్రదోషకాలంలో లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా సాయంత్రం 6.10 గంటల నుంచి రాత్రి 8.52 గంటల మధ్య కాలంలో లక్ష్మీపూజకు మంచి సమయమని పండితులు చెబుతున్నారు.