ప్రధాని నరేంద్ర మోదీకి…. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని కోరారు. ఎందరో కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ పర్యటన సందర్భంగా కాళేశ్వరం అవినీతి గురించి ప్రస్తావిస్తన్నారని, ఇప్పటి వరకు ఎందురు చర్యలు తీసుకోలేని షర్మిల తన లేఖలో ప్రస్తావించారు.
దివంగత సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టును రూ.40,000 కోట్లతోనే నిర్మించాలని అంచనా వేశారని షర్మిల గుర్తుచేశారు. అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని పేరు మార్చారని షర్మిల తప్పుబట్టారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పేరు మార్చడంతో పాటు ఖర్చును కూడా 300 శాతం పెంచారని షర్మిల తన లేఖలో ప్రస్తావించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్ధం కావడం లేదని షర్మిల తన లేఖలో ప్రస్తావించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే కాళేశ్వరంలోని అవినీతిపై అలుపెరుగని పోరాటం చేస్తోందని షర్మిల గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేసీఆర్, కేసీఆర్‌కి చెందిన కాంట్రాక్టర్లు ధనవంతులుగా మారుతున్నారని షర్మిల ఆరోపించారు.
మీరు తెలంగాణ గడ్డ మీద మరోసారి అనుగు పెడుతున్న సందర్భంగానైనా ఈ ప్రాజెక్టు అవినీతిపై చర్యలు తీసుకుంటారని షర్మిల కోరారు. దేశ ఇరిగేషన్ సెక్టార్ ఇది అతి పెద్ద స్కామ్ అని షర్మిల తెలిపారు. ఈ విషయంలో ప్రధాని కార్యాలయం ఓ స్టేట్మెంట్ ఇవ్వాలని కూడా షర్మిల కోరారు.