»Woman Protests Against Double Bed Room Houses In Miryalaguda
Double Bed Room Houses : డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని ఒంటిపై పెట్రోల్ పోసుకున్న మహిళ
తాజాగా తనకు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని అధికారులు కేటాయించలేదని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది.
Double Bed Room Houses : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించే చర్చ నడుస్తోంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిరుపేదలకు కేటాయించడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా తనకు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని అధికారులు కేటాయించలేదని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది.
నిరుపేదలు చాలామంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందరితో పాటు ఓ మహిళ కూడా దరఖాస్తు చేసుకుంది. అయితే.. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఎక్కువ స్థాయిలో దరఖాస్తులు రావడంతో అధికారులు లక్కీ డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశారు. డ్రా ద్వారా కొందరికి ఇండ్లు రాగా.. మరికొందరికి రాలేదు. తనకు ఎలాగైనా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వస్తుందని ఆశించిన ఆ మహిళకు నిరాశే ఎదురైంది. తనకు ఇల్లు రాకపోవడంతో ఏం చేయాలో తెలియలేదు.
Double Bed Room Houses : తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ
తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు రాలేదని తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ ఏం చేయాలో తెలియక అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుంది. అగ్గిపెట్టెతో మంటలు అంటించుకునే ప్రయత్నం చేయగా వెంటనే స్పందించిన పోలీసులు ఆ మహిళ ఆత్మహత్య చేసుకోకుండా రక్షించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. లక్కీ డ్రాలో ఇల్లు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటారా? అంటూ స్థానికులు మండిపడుతున్నారు.