»Without Being Able To Face Me They Brought My Daughter On The Road A Tearful Jangaon Mla
Jangaon:నన్ను ఎదుర్కోలేకనే.. నా బిడ్డను రోడ్డుమీదకు తెచ్చారు. కన్నీళ్లు పెట్టుకున్న జనగామ ఎమ్మెల్యే
మీడియాతో తన ఆవేదనను వ్యక్త పరిచిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. క్షేత్రస్థాయిలో తనను ఎదుర్కొనే దమ్ము లేనొల్లే తన కూతుర్ని, అల్లుడిని అడ్డం పెట్టుకొని గేమ్స్ ఆడుతున్నారని.. ఏమి తెలియని తన బిడ్డను రోడ్డుమీదకు తెచ్చారు.
Without being able to face me.. they brought my daughter on the road. A tearful Jangoan MLA
Jangaon:జనగామ నియోజకవర్గ బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(Muthireddy Yadagiri Reddy), ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డిల(tulja bhavani Raddy) మధ్య గత కొంత కాలంగా భూవివాదం కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. తన కూతురిని అడ్డుపెట్టుకొని తన అల్లుడిని తన మీదకు ఉసిగొల్పుతున్నారంటూ తాను మీడియా ముఖంగా తన ఆవేదనను వ్యక్తపరిచారు. గత కొంతకాలంగా జనగామ నియోజకవర్గంలోని చేర్యాల ప్రాంతంలో ఉన్న 23 గుంటల తన కూతురు తుల్జా భవాని రెడ్డి భూమిని… ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(Muthireddy Yadagiri Reddy) కబ్జా చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు యాదగిరి రెడ్డి ఎమ్మెల్యేగా(MLA) తన విధులను నిర్వర్తించకుండా తన కూతురు, అల్లుడు అడ్డుపడుతున్నారంటూ హైకోర్టును కూడా ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదానికి సంబంధించి మరో కోణాన్ని మీడియా ముఖంగా పంచుకున్నారు ఎమ్మెల్యే.
తన బిడ్డకు ఏ పాపం తెలియదని, తాను అమాయకురాలు అని చెప్పారు. తన కుతుర్ని అడ్డం పెట్టుకొట్టుకొని అల్లుడిని తన మీదకు కొందరు ప్రేరేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తనను ఎదుర్కొనే దమ్ము లేనోళ్లే ఇలా వక్రమార్గంలో తన మీద ఆరోపణలు చేస్తున్నారని మీడియాతో తెలిపారు. ఈ మొత్తం వివాదంలో అమాయకురాలైన తన బిడ్డను రోడ్డు మీద తెచ్చారని మండిపడ్డారు. తనకు ఎప్పుడూ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని తెలిపారు. ప్రజలకు నిజానిజాలు ఏంటో తెలుసన్నారు. ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసినా నన్ను ప్రజల నుంచి దూరం చేయలేరని తెలిపారు.
ఇక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(Muthireddy Yadagiri Reddy) మాటలు విన్న ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. ఈ వివాదంలో అసలు దోషులు ఎవరు.. ఇంతకీ ఎమ్మెల్యే అల్లుడిని, కూతురుని తన మీదకు రెచ్చగొట్టింది ఎవరు అనేది కొత్త చర్చకు దారితీసింది.