»Vst Steel Bridge Should Be Completed In Three Months Minister Ktr
KTR : VST స్టీల్ బ్రిడ్జిని మూడు నెలల్లో పూర్తి చేయాలి : మంత్రి కేటీఆర్
ముషీరాబాద్( Mushirabad) నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఎస్ఎస్ డీపీ ( SNDP ) పనులను కేటీఆర్ పరిశీలించారు.సెంట్రల్ హైదరాబాద్ నగరానికి స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతుందన్నారు. మూడు నెలల్లో వంతెన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ముషీరాబాద్( Mushirabad) నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఎస్ఎస్ డీపీ ( SNDP ) పనులను కేటీఆర్ పరిశీలించారు.సెంట్రల్ హైదరాబాద్ నగరానికి స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతుందన్నారు. మూడు నెలల్లో వంతెన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. అవసరమైతే అదనపు బృందాలు ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలని సూచించారు. 2.8 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జి కోసం జీహెచ్ఎంసి రూ. 440 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు.
స్టీల్ బ్రిడ్జి నిర్మాణం తర్వాత ట్రాఫిక్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. హుస్సేన్ సాగర్ (Hussain Sagar) సర్ప్లస్ నాలాలో చేపడుతున్న పనులను కూడా కేటీఆర్ పరిశీలించారు. అశోక్ నగర్ (Ashok nagar) వద్ద కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. వరద ప్రవాహన్ని తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాకు భారీగా నిధులు కేటాయించామని స్పష్టం చేశారు. వర్షాకాలం నాటికి పనులన్నీ పూర్తి చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.