»Sonu Sood Was Happy To Make A Difference In People Rather Than Being A Part Of A Rs 1000 Crore Film
Sonu Sood: పఠాన్ మూవీపై సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు?
బాలీవుడ్ నటుడు సోనూ సూద్(Sonu Sood) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.1000 కోట్ల సినిమా(movie)లో భాగం కావడం కంటే ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడం తనకు "చాలా ఎక్కువ సంతృప్తిని" ఇస్తుందని వెల్లడించారు. మరోవైపు పరోక్షంగా పఠాన్ మూవీని విమర్శించారని పలువురు అంటున్నారు.
బాలీవుడ్ నటుడు, సేవా హృదయం గల వ్యక్తి సోనూసూద్(Sonu Sood) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే సంతోషాన్ని ఇచ్చిందని స్పష్టం చేశాడు. ఆ క్రమంలో తనకు రూ.1000 కోట్ల సినిమాలో భాగం కావడం కంటే “చాలా సంతృప్తిని” ఇచ్చిందని సోనూసూద్(Sonu Sood) వెల్లడించాడు. బోడోలాండ్ నాలెడ్జ్ ఫెస్టివల్ ముగింపు వేడుకలో పాల్గొన్న సందర్భంగా ఈ విధంగా పేర్కొన్నారు.
“నేను గత 18 నుంచి 20 ఏళ్లుగా సినిమాల్లో పనిచేస్తున్నాను నన్ను నమ్మండి. మీరు రూ.500 కోట్లు లేదా రూ.1,000 కోట్ల సినిమాలో భాగం కావచ్చు. కానీ ఆ విజయం మీకు అంత ఆనందాన్ని ఇవ్వదు. మీరు ఒక వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులను తీసుకువచ్చినప్పుడు ఆ సంతోషాన్ని మీరు అనుభవిస్తారు.”
హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠీ, చైనీస్, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో దాదాపు 100 సినిమాల(movies)కు పనిచేశాను. దాదాపు అనేక సినిమాలు హిట్ అయ్యాయి, నేను విజయం సాధించాను. కానీ కరోనా సమయంలో సామాన్య ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం తనకు లభించినప్పుడు చాలా సంతృప్తిని ఇచ్చినట్లు తెలిపాడు. కరోనా సమయంలో తాను హెల్ప్ చేసిన వారు తెలియని వ్యక్తులు, ఇంతకు ముందు వారిని కలవలేదన్నారు. కానీ తాను తెలిసి లేదా తెలియక వారి జీవితాల్లో కొంత ఆనందాన్ని ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. ప్రతిఫలంగా ఆశీర్వాదాలు పొందగలిగినప్పుడే విజయం ఎలా ఉంటుందో గ్రహించానని వెల్లడించారు. COVID-19 వ్యాప్తి నేపథ్యంలో లక్షలాది మంది వలస కార్మికులు వారి స్వస్థలాలకు తిరిగి రావడానికి సోనూసూద్ సహాయం చేశాడు.
అయితే ప్రస్తుతం పఠాన్ మూవీ వెయ్యి కోట్ల మైలురాయిని అధిగమించింది. ఈ క్రమంలో సోనూసూద్ పరోక్షంగా పఠాన్ మూవీ(Pathan movie)ని విమర్శించారని పలువురు అంటున్నారు.