తెలంగాణలో TSPSC ప్రశ్నాపత్రాల ఘటన కలకలం రేపుతోంది. తాజాగా మరో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు TSPSC ప్రకటించింది. ఇదిలా ఉండగా ఏప్రిల్4వ తేదీన జరగాల్సి ఉన్న హార్టీకల్చర్పరీక్షను(Horticulture Exam) టీఎస్పీఎస్సీ బోర్డు జూన్17వ తేదీకి వాయిదా వేసింది. కస్టడీ ముగియటంతో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు (Question papers leakage case) నిందితులు నలుగురిని సిట్అధికారులు కోర్టులో హాజరుపరిచారు.
అంతకుముందు వీరికి కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో(Kothi Government Hospital) వైద్యపరీక్షలు జరిపించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మరిన్ని వివరాలను రాబట్టాల్సి ఉన్నందున ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి, లద్యావత్దాక్యా, రాజేశ్వర్నాయక్, షమీమ్, రమేశ్, సురేష్లను కస్టడీకి అనుమతించాలంటూ సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో (Nampally Court) పిటీషన్వేసిన విషయం తెలిసిందే. అయితే, కోర్టు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి, లద్యావత్దాక్యా, రాజేశ్వర్నాయక్లను మాత్రమే మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలో వీరిని అదుపులోకి తీసుకున్న సిట్అధికారులు (SIT officials) విచారణ జరిపారు. అయితే, దీంట్లో పెద్దగా కీలకమైన వివరాలు ఏవీ వెల్లడి కాలేదని తెలిసింది.