TS Inter First, Second Year Results Released Tomorrow
TS Inter results:మరికొన్ని గంటల్లో తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు (inter results) విడుదల కానున్నాయి. నాంపల్లిలో గల ఇంటర్ బోర్డు కార్యాలయంలో రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy) ఫలితాలను విడుదల చేస్తారు. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ ఓకేసారి విడుదల చేస్తారు. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు రెగ్యులర్, ఒకేషనల్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. 9.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఇంటర్ పరీక్షలు (inter exams) జరిగిన నెలరోజుల్లోపే ఫలితాలు రిలీజ్ చేస్తారు. ఈ సారి కాస్త ఆలస్యమైంది. ఇంటర్ ఫలితాలు విడుదలైన 2,3 రోజులకు పదో తరగతి ఫలితాలను విడుదల చేస్తారని తెలిసింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11వ తేదీ వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఆరు పేపర్లు (6 papers) కాగా.. వాల్యుయేషన్ కూడా త్వరగా పూర్తి అయ్యింది. అయితే తెలుగు, హిందీ పేపర్ లీకేజీ అంశం కలకలం రేపింది. దాని ప్రభావం ఫలితాలపై చూపే అవకాశం ఉంది.