Man Bungee Jump:ఇప్పుడు విడాకులను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అవును ఒకప్పటి లాగా పరిస్థితి లేదు. తమిళ నటి ఫోటో షూట్ పెట్టి.. రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొ వ్యక్తి ఏకంగా బంగి జంప్ (Bungee Jump) చేశాడు. అదీ వికటించడంతో ఆస్పత్రి పాలయ్యాడు. నిజానికి ఈ ఘటన ఫిబ్రవరిలో జరిగినప్పటికీ.. అతను కోలుకోవడంతో తాజాగా వెలుగులోకి వచ్చింది.
బ్రెజిల్‌కు (brazil) చెందిన రాఫెల్ డోస్ శాంటోస్ తోస్టా.. వ్యక్తిగత కారణాల వల్ల భార్యతో విడాకులు తీసుకున్నాడు. తర్వాత నచ్చిన పనులను చేయడం ప్రారంభించాడు. బంగీ జంప్ చేయాలని అనుకొని.. కాంపో మాగ్రోలో బ్రిడ్జ్ స్వింగ్‌లో పాల్గొనేందుకు వెళ్లాడు. 70 అడుగుల ఎత్తు (70 foot height) నుంచి జంప్ చేయాలని వెళ్లాడు. తాడు సాయంతో కిందకు దూకాడు.. కానీ తాడు తెగిపోవడంతో కిందన గల నీటిలో పడిపోయాడు.
ఎత్తు నుంచి పడటంతో మెడ విరిగింది. తీవ్రంగా గాయపడ్డప్పటికీ.. ప్రాణాలతో (save) బయటపడ్డాడు. ‘ఆ రోజు కళ్లు తెరిచే సమయానికి నీటిలో ఉన్నా. చుట్టు ఉన్న వారు కదలకు అలాగే ఉండు, సాయం చేయడానికి వస్తున్నారు అన్నారు. తనకు ఏం జరిగిందో అర్థం కాలేదు’ అని ఆ నాటి ఛేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు. జీవితం అంటే విలువైందని.. లెక్క చేయకుండా పిచ్చి పనులు చేశానని బాధపడ్డాడు.
ఇటీవల తమిళ టీవీ నటి షాలిని ( Shalini) కూడా విడాకులు తీసుకున్నారు. అలా అని పండగ చేసుకున్నారు. ఆనందంతో విడాకుల ఫోటోషూట్ చేసుకున్నారు. రెడ్ కలర్ డ్రెస్ ధరించి.. చేతిలో డైవొర్స్ అనే అక్షరాలు పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. అంతేకాదు భర్తతో కలిసి ఉన్న ఫోటోను చించివేశారు. ఆమె రియాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కూతురు కూడా జన్మించింది. కొన్నేళ్ల తర్వాత విభేదాలు వచ్చాయి. కొన్నినెలల క్రితం షాలిని కోర్టును ఆశ్రయించింది. తాజాగా విడాకులు ఇవ్వడంతో.. ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంది. ఫోటో షూట్ నిర్వహించి.. ఫోటోను సగానికి పైగా చించేసింది.