Dutyలో చేరకుంటే.. ఉద్యోగం ఉండదు, పంచాయతీ సెక్రటరీలకు సీఎం కేసీఆర్ వార్నింగ్
రేపు సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలని పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం అల్టిమేటం జారీచేసింది. లేదంటే విధుల నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది.
CM KCR:డిమాండ్ల సాధన కోసం ఆందోళనకు దిగిన పంచాయతీ సెక్రటరీలపై ( Panchayat Secretaries) సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపారు. రేపు (మంగళవారం) సాయంత్రం 5 గంటల లోపు విధుల్లో చేరాలని డెడ్ లైన్ విధించారు. లేదంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని తేల్చిచెప్పారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా (sandeep kumar) నోటీసులు జారీచేశారు. ప్రభుత్వం నిర్ణయించిన అభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తూ.. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దడంలో కార్యదర్శులు కీ రోల్ పోషిస్తారు.
తమను రెగ్యులర్ చేయాలని పంచాయతీ కార్యదర్శులు ( Panchayat Secretaries) కోరుతున్నారు. గత నాలుగేళ్ల ప్రొబెషనరీ కాలాన్ని సర్వీసు కాలంగా గుర్తించాలని అంటున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న అందరు ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను జూనియప్ పంచాయతీ కార్యదర్శులుగా ప్రమోట్ చేయాలంటున్నారు. పంచాయతీ కార్యదర్శుల క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారించి ప్రకటించాలని అడిగారు. చనిపోయిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కుటుంబాలకు కారుణ్య నియమాకాలు చేపట్టి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పంచాయతీ కార్యదర్శుల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందించడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రొబెషనరీ గడువు 2023 ఏప్రిల్ 11వ తేదీతో ముగిసింది. రెగ్యులరైజ్ గురించి ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో పంచాయతీ కార్యదర్శులు సమ్ముకు దిగారు. 2019 ఏప్రిల్ 12వ తేదీన విధుల్లో చేరిన జేపీఎస్ను మూడేళ్ల ప్రొబెషనరీ తర్వాత రెగ్యులరైజ్ చేస్తామని చెప్పింది. మరో ఏడాది ప్రొబెషనరీ కాలాన్ని పెంచింది. నాలుగేళ్లు ముగిసినా.. రెగ్యులరైజ్ చేయడం లేదు. దీంతో పంచాయతీ సెక్రటరీలు సమ్ము బాట పట్టగా.. వారికి ప్రభుత్వం అల్టిమేటం జారీచేసింది.