»Tinmar Mallanna Registar New Political Party Telangana Nirmana Party Medchal Competition
Tinmar Mallanna: కొత్త రాజకీయ పార్టీ..మేడ్చల్లో పోటీ?
ఎట్టకేలకు తీన్మార్ మల్లన్న మళ్లీ తెలంగాణ రాజకీయ రణరంగంలోకి వస్తున్నారు. గతంలోనే తాను రాజకీయ పార్టీ తప్పకుండా పెడతానని చెప్పగా..తాజాగా తెలంగాణ నిర్మాణ పార్టీ పేరును రిజిస్టర్ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.
గతంలో రాష్ట్రంలో తాను కొట్ట పార్టీ పెడతానని ప్రకటించిన తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna) ఎట్టకేలకు ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’(telangana nirmana party)పేరుతో కొత్త రాజకీయ పార్టీని రిజిస్టర్ చేయాలని భారత ఎన్నికల సంఘానికి అప్లై చేశారు. తన అధ్యక్షతన పార్టీ పేరును రిజిస్టర్ చేయాలని మల్లన్న ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే పార్టీ పేరు, ఇతర అంశాలపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 30లోపు తెలియజేయాలని ఎన్నికల సంఘం(CEC) వెబ్ సైట్ తెలిపింది. మరోవైపు ఈ పార్టీ కార్యదర్శిగా మాదం రజినీ కుమార్ (వరంగల్ జిల్లా,ధర్మసాగర్), కోశాధికారిగా ఆర్.భావన(చంపాపేట్, సరూర్ నగర్) ఉంటారని ఆయన దరఖాస్తులో స్పష్టం చేశారు.
అయితే గతంలో సీఎం కేసీఆర్(CM KCR), ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తీన్మార్ మల్లన్న జైలుకెళ్లారు. ఆ తర్వాత కోర్టు బెయిల్పై విడుదలయ్యారు. ఆ క్రమంలోనే అధికార పార్టీని గద్దె దించేందుకు, రానున్న ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు అప్పుడు వచ్చే ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని మల్లన్న ప్రకటించారు.