»Three People Died In One House Due To Electric Shock In Shakepet
Current shock : షేక్ పేట్లో విద్యుత్ షాక్ తో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి
హైదరాబాద్ (Hyderabad) షేక్ పేట్లో తీవ్ర విషాదం జరిగింది. పారామౌంట్ కాలనీ (Paramount Colony)లో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతిచెందారు. వాటర్ సంప్ క్లీన్ (Clean the water sump) చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందారు.
హైదరాబాద్ (Hyderabad) షేక్ పేట్లో తీవ్ర విషాదం జరిగింది. పారామౌంట్ కాలనీ (Paramount Colony)లో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతిచెందారు. వాటర్ సంప్ క్లీన్ (Clean the water sump) చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతిచెందారు. మొదట సంపులోకి దిగిన రజాక్ (Razak) కు కరెంట్ షాక్(Current shock) కొట్టగా అతన్ని కాపాడేందుకు సోదరుడు రిజ్వాన్ వెళ్లి మునిగిపోయాడు. ఆ ఇద్దరిని కాపాడేందుకు వెళ్లిన బంధువు అనాస్ కూడా విద్యుత్ షాక్తో మరణించడంతో పారామౌంట్ కాలనీలో విషాద చాయలు అలుముకున్నాయి. మృతిచెందిన వారు అనాస్(19), రజాక్(18), రిజ్వాన్(16 ). ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ (Banjara Hills) పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.